జల్సాలకు అలవాటుపడి చోరీలు..ముగ్గురు అరెస్ట్

జల్సాలకు అలవాటుపడి చోరీలు..ముగ్గురు అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ సాయిచరణ్ అనే వ్యక్తి సహా ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. జల్సాలకు అలవాటు పడి నాచారం, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్ కేసర్ సహా పలు ప్రాంతాలలో బైకులను దొంగతనం చేసినట్లు చెప్పారు. 

గతంలో కూడా నిందితులు పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారని ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బైకుల విలువ 10 లక్షలపైనే ఉంటుందన్నారు. నిందితులను యమ్నంపేట ఫ్లై ఓవర్ వద్ద చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్ టీం సభ్యులను ఏసీపీ అభినందించారు.