అయ్యో..అందుకేనా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తలేవ్

అయ్యో..అందుకేనా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తలేవ్

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 5 లక్షలు విలువ చేసే 26 పెద్ద బ్యాటరీలు, 48 చిన్న బ్యాటరీలను స్వాధీనం చేస్తుకున్నారు. వీరిపై చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో 11 కేసులు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు షేక్ అజీముద్దీన్, జంగల మద్దిలేటి లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు అబిడ్స్ సిఐ ప్రసాద్ తెలిపారు.