పిట్లం, వెలుగు : సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, ప్రేమ పేరుతో మోసాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందం పిట్లం గర్ల్స్ హైస్కూల్లో సోమవారం కళాప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కళాబృందం సభ్యులు సైబర్ నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, ట్రాఫిక్ రూల్స్‌పై పాటలు, నాటికల ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు.
కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ దామరంచ తిరుపతి మాట్లాడుతూ ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం జరీనా, హెడ్ కానిస్టేబుళ్లు శేషారావు, ప్రభాకర్, సాయిలు, శారద, స్రవంతి స్కూల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

