భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు అరెస్టు

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు అరెస్టు

దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జహంగీర్‌పురి నుండి జనవరి 12న ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు.  ఉగ్రవాదులను నౌషాద్ , జగ్జిత్‭లుగా గుర్తించారు. వారి వద్ద నుండి 2 మిలిటరీ గ్రేడ్ హ్యాండ్ గ్రెనేడ్‌లు, 3 పిస్టల్స్, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్‭తో సంబంధాలు ఉన్నట్లుగా అదనపు సీపీ పి కుష్వాహ ప్రకటించారు.