పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు.. కేసు బుక్ చేసిన పోలీసులు

పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు.. కేసు బుక్ చేసిన పోలీసులు

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు అందడంతో ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు బుక్ చేశారు. తెనాలి మారీస్ పేటకు చెందిన పి. శివకుమార్ అనే వ్యక్తి ఈ నెల 5న ఇప్పటం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి బైక్పై వెళ్తుండగా.. పవన్ కళ్యాణ్ కారణంగా ప్రమాదానికి గురయ్యానని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీఎస్ 07 సీజీ 2345 కారు టాప్పై కూర్చొని ఉండగా.. మరికొందరు దానికి వేళాడుతూ కనిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ కారు వెనుక మరికొన్ని వాహనాలు అత్యంత వేగంగా దూసుకెళ్లడంతో ఆ వేగానికి తన బైక్ అదుపుతప్పి కిందపడిపోయానని శివకుమార్ కంప్లైంట్ చేశాడు. అజాగ్రత్తగా, అతివేగం, నిర్లక్ష్యంతో పాటు ప్రజలకు ప్రమాదం కలిగేలా కారు నడిపిన డ్రైవర్తో పాటు కారు టాప్పై కూర్చున్న పవన్ కళ్యాణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించాడు. శివ కుమార్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పవన్ కళ్యాణ్తో పాటు కారు డ్రైవర్పై కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 279, 336తో పాటు మోటార్ వెహికిల్ యాక్ట్ లోని 177 సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.