
కొల్లాపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున గుర్తుతెలియని యువతి డెడ్ బాడీ లభ్యమైంది. ఎస్ఐ రామన్ గౌడ్ కథనం ప్రకారం.. పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట సమీపంలోని కృష్ణా నది తీరానికి ఆనుకొని చింతరాయ గుట్ట వద్ద సోమవారం గొర్ల కాపరులకు గుర్తుతెలియని యువతి డెడ్ బాడీ కనిపించింది.
మంచాలకట్ట గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. ఐదు రోజుల కింద ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.