హిమాచల్‌లో650 రోడ్లు మూసివేత

హిమాచల్‌లో650 రోడ్లు మూసివేత
  • సురక్షిత ప్రాంతాలకు పర్యాటకుల తరలింపు 

సిమ్లా : భారీ హిమపాతం కారణంగా హిమాచల్‌ ప్రదేశ్​లో ఐదు హైవేలు సహా 650 రోడ్లను పోలీసులు మూసివేశారు. గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో పాటు ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం కారణంగా అక్కడ కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. దీంతో పోలీసులు సోమవారం రోడ్లను బ్లాక్​చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

రోడ్లు మూసుకుపోవడంతో పలువురు టూరిస్టులు అక్కడక్కడ చిక్కుకుపోగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. స్పితి వ్యాలీలో చిక్కుకున్న 81 మంది పర్యాటకులను ఆదివారం రాత్రి అక్కడి నుంచి వేర్వేరు హోటళ్లు, హోమ్‌స్టేలకు తరలించి బస ఏర్పాటు చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.