గంజాయితో పారిపోతుండగా పల్టీ కొట్టిన కారు

గంజాయితో పారిపోతుండగా పల్టీ కొట్టిన కారు

విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవాలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇన్నోవాను ఆపే ప్రయత్నం చేయగా.. గంజాయి స్మగ్లర్లు  ఇన్నోవాను విజయవాడ వైపు తిప్పి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఎస్ఓటీ పోలీసులు వాహనాన్ని వెంబడించారు. తప్పించుకునే ప్రయత్నంలో చిట్యాల మండలం బొంగోని చెర్వు వద్ద ఇన్నోవా పల్టీ కొట్టింది. పోలీసులు రావడం చూసిన స్మగ్లర్లు అక్కడి నుండి పరారయ్యారు. కారులో భారీగా ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితుల కోసం స్పెషల్ టీం పోలీసులు గాలిస్తున్నారు.