ఈ ట్రెండ్​ మారాలె: అధికార పార్టీలకు అనుకూలంగా పోలీసులు

ఈ ట్రెండ్​ మారాలె: అధికార పార్టీలకు అనుకూలంగా పోలీసులు
  • ఈ ట్రెండ్​ మారాలి : సీజేఐ ఎన్వీ రమణ
  • కొత్త పార్టీ అధికారంలోకి రాగానే పోలీసులపై కేసులు పెడుతున్నరు
  • దీనికి పోలీసు శాఖనే బాధ్యత వహించాలి
  • పోలీసులు రూల్ ఆఫ్ లాకు కట్టుబడి ఉండాలి
  • చత్తీస్‌‌గఢ్ ఏడీజీపై దేశద్రోహం కేసు విచారణలో కామెంట్స్
  • రూల్​ ఆఫ్​ లాకు కట్టుబడి ఉండాలె: సీజేఐ ఎన్వీ రమణ

కలవరపెట్టే ట్రెండ్ ఒకటి దేశంలో మొదలైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కొందరు పోలీసాఫీసర్లు అనుకూలంగా పని చేస్తున్నారు. అధికార మార్పిడి జరిగి వేరే పార్టీ గద్దెకెక్కగానే సీన్ మారిపోతోంది. అంతకు ముందున్న పార్టీ కనుసన్నల్లో పనిచేసిన పోలీసు ఆఫీసర్లపై కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా బాధ్యత వహించాల్సి ఉంది. ఈ ట్రెండ్ మారాల్సిన అవసరముంది.
న్యూఢిల్లీ: పోలీసు అధికారుల తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక కామెంట్లు చేశారు. అధికారంలో ఉన్న పార్టీల వైపే కొందరు పోలీసులు ఉంటున్నారని అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసు అధికారులు.. తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. ఇది కలవరపెట్టే ట్రెండ్ అని, దీనికి పోలీస్ డిపార్ట్​ మెంట్ కూడా బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. దీన్ని మార్చాల్సిన అవసరముందని చెప్పారు. పోలీసు అధికారులు రూల్ ఆఫ్ లాకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. దేశద్రోహం కేసులో చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడీజీపీ గుర్జీందర్ పాల్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన ఈ కామెంట్లు చేశారు.
ప్రభుత్వంపై కుట్ర చేశారంటూ కేసు
1994 బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుర్జీందర్ పాల్ సింగ్.. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, దుర్గ్, బిలాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ఐజీగా పని చేశారు. మొన్నటి దాకా చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఆయన అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ, ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) జూన్ 29న ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదు చేశాయి. జులై 1 నుంచి 3 వ తేదీ దాకా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 15 లొకేషన్లలో ఏసీబీ, ఈవోడబ్ల్యూలు సోదాలు చేశాయి. దాదాపు 10  కోట్ల ఆస్తులను గుర్తించాయి. సోదాల సందర్భంగా చించేసిన పేపర్లు సింగ్ ఇంటి బయట కనిపించాయని, వాటిని ఒక దగ్గర పేర్చి చూసినప్పుడు తీవ్రమైన, సున్నితమైన సమాచారం అందులో ఉన్నట్లు తేలిందని ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. పొలిటికల్ పార్టీలపై కుట్రకు సంబంధించిన ప్లాన్లను అందులో ఉన్నట్లు నోట్ చేశారు. సీజ్ చేసిన డాక్యుమెంట్లలోనూ ప్రభుత్వంపై ద్వేషం, అసంతృప్తిని ప్రోత్సహించేలా రెచ్చగొట్టే కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పోలీసులు రాజద్రోహం, అక్రమ ఆస్తుల కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జులై 5న గుర్జీందర్ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురయ్యారు. తనపై నమోదైన కేసులను రద్దు చేయాలని  గుర్జీందర్ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
విచారకర పరిస్థితులు
గురువారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. దేశంలో చాలా విచారకర పరిస్థితులు ఉన్నాయని కామెంట్ చేసింది. గుర్జీందర్ తరఫున కేసు వాదించిన సీనియర్ అడ్వకేట్ ఎఫ్ఎస్ నారిమన్.. ‘‘గుర్జీందర్ ఏడీజీపీగా పని చేస్తున్నారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా రాజద్రోహం కింద చర్యలు ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునేందుకు సాయం చేయాలని గుర్జీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రస్తుత సీఎం కోరారు. ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారు. ఇక కొత్తగా కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదు” అని కోర్టుకు విన్నవించారు. దీంతో స్పందించిన బెంచ్.. ‘‘ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం మారి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు.. సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటోంది” అని చెప్పింది.
దేశద్రోహం కేసును పరిశీలిస్తం
ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్లు ముకుల్ రోహత్గీ, రాకేశ్ ద్వివేదీ, సుమీద్ సోధి హాజరై వాదనలు వినిపించారు. ‘‘ఆయన పోలీసు అకాడమీకి హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. కానీ ఆయన ప్రవర్తన చూడండి.. పరారీలో ఉన్నారు. అరెస్టు నుంచి ఆయనకు రక్షణ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వొద్దు’’ అని బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ కోరారు. స్పందించిన బెంచ్.. ‘‘మేం దేశద్రోహం కేసును పరిశీలిస్తాం. ఇది కలవరపెట్టే ధోరణి. దీనికి పోలీసు శాఖ బాధ్యత వహించాలి. మీ క్లయింట్ (సింగ్) న్యాయంగా ఉన్నారని చెప్పొద్దు. ఆయన ఆనాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరించారు” అని చెప్పింది. గుర్జీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నాలుగు వారాలపాటు అరెస్టు చేయొద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. దర్యాప్తు సంస్థలకు సహకరించాలని  ఆదేశించింది.