ఇది అటెంప్ట్ టు మర్డర్, లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా..? లేనట్టా..? : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ఇది అటెంప్ట్ టు మర్డర్, లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా..? లేనట్టా..? : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
  • ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే ఎలా?
  • పోలీసుల వైఫ్యంలోనే ఇలా జరిగింది
  • వాళ్లను సస్పెండ్ చేయాల్సిందే
  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు తనపై హత్యాయత్నం చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. ఒక శాసన సభ్యుడికే రక్షణ లేకుంటే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని అన్నారు. పోలీసుల వైఫల్యంతోనే ఇదంతా జరిగిందని అన్నారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన ఇంటి అద్దాలను పగులగొట్టారని, గేట్లను ధ్వంసం చేశారని, వారిపై హత్యాయత్నం క ఏసు నమోదు చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సైబరా బాద్  సీపీలో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు.

గాంధీ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ధర్నాకు దిగిన అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ డీసీపీ వినీత్ నేతృత్వంలో పోలీసులు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకొని గాంధీని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీని పోలీసులు కూకట్ పల్లిలో నివాసానికి తీసుకెళ్లారు.