యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసు

యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసు

యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసును ఎస్పీ సస్పెండ్‌ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడి కోసం మహిళా పోలీసులు గాలిస్తున్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరుకు జాక్సన్‌ 2017లో పోలీసు విధుల్లో చేరాడు. అతనికి పోటీ పరీక్షల పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి పరిచయమైంది. ఆమె నెంబరు తీసుకుని మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. ప్రస్తుతం అతను డీఎంకే యువజన విభాగం నేతకు గన్‌ మెన్‌గా మారాడు. ఆ యువతిని పట్టించుకోవడం మానేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకురాగా తనకు ఉద్యోగం పోయిందని, కొంతకాలం వేచి ఉండాలని సూచించాడు. అతడి మోసాన్ని పసిగట్టిన యువతి తిరుచెందూరు మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది. రాజకీయ పలుకుబడితో జాక్సన్‌ తప్పించుకునే యత్నం చేశాడు. ఆమె ఎస్పీ జయకుమార్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ జాక్సన్‌ ను సస్పెండ్‌ చేశారు.