
- పరారీలో ఒడిశాకు చెందిన ముగ్గురు
శాంతినగర్, వెలుగు: గోల్డ్‌షాప్‌లో చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ టాటాబాబు తెలిపారు. శాంతినగర్ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్‌లోని శ్రీనివాస గోల్డ్‌షాప్‌లో ఈ నెల 3న దుండగులు చోరీకి పాల్పడ్డారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏపీలోని పల్నాడు జిల్లా స్టువర్టుపురం దగ్గరలోని అచ్చేయపల్లెకు చెందిన భోగిరి రవిని బుధవారం బెల్లంకొండ దగ్గర అరెస్ట్ చేశారు.
ఒడిశాకు చెందిన సోను, శివ, ప్రవీణ్ పరారీలో ఉన్నారు. రవి వద్ద నుంచి రూ.లక్షన్నర, 841 గ్రాముల వెండి బార్, 5 జతల వెండి పట్టీలు, 2 బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఎస్సై నాగశేఖర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.