
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ DSP ప్రణీత్ రావును కస్టడీ కోరుతూ మార్చి 14వ తేదీ గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. వారం రోజుల పాటు కస్టడి ఇవ్వాలని కోరనున్నారు. మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో ప్రణీత్ రావును పంజాగట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. అనంతరం ప్రణీత్ రావు కేసును విచారించేందుకు జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ ను నియమించారు.
ప్రస్తుతం ప్రణీత్ రావు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. SIB లో పనిచేస్తున్నప్పుడు పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో వార్ రూమ్ లు ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యూలరీ వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ న్యాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి ఆర్థిక లావాదేవీలను దెబ్బతీశారన్న ఆరోపణలున్నాయి.ప్రణీత్ రావు ను కస్టడీకి అనుమతిస్తే విచారణలో మరిన్ని వివషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ALSO READ :- పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా... తాగుబోతు హల్ చల్..