ఖమ్మం జైలుకు..ప్రీతి కేసు నిందితుడు సైఫ్‌

ఖమ్మం జైలుకు..ప్రీతి కేసు నిందితుడు సైఫ్‌

హైదరాబాద్ నిమ్స్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మెడికో స్టూడెంట్ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ ను పోలీసులు హనుమకొండ జిల్లా వరంగల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించనున్నారు. అంతకుముందు సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడు సైఫే అనే మొదటి నుంచీ ప్రీతి తండ్రి నరేందర్ వాదిస్తుండగా.. సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధించినట్లు ఆధారాలున్నాయని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. వాట్సాప్  గ్రూప్ లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని  చెప్పారు.  గ్రూప్ లలో మెసేజ్ లు పెట్టి  వేధించొద్దని  ప్రీతి వేడుకున్నా సైఫ్ వినలేదన్నారు. బ్రెయిన్‌ లేదంటూ సైఫ్‌ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని వివరించారు.