కల్తీ పాల తయారీదారులు అరెస్ట్ 

కల్తీ పాల తయారీదారులు అరెస్ట్ 

కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా తయారైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ తాగే పాలను కూడా కొందరు కంత్రీగాళ్లు కల్తీగా మారుస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బీ యన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎరుకల భాస్కర్, ఎరుకల బాలనర్సయ్య, నకిరేకంటి రాజు కలిసి కల్తీ పాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎస్​ వోటీ పోలీసులు మెరుపు దాడి చేశారు.  

కల్తీ పాలను తయారు చేయడం కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ లో పాల పౌడర్ ను కలుపుతున్నారు. దీంతో పాటు హైడ్రో క్లోరిక్ యాసిడ్ ను మిక్స్ చేస్తున్నారు. ఈ పద్దతిలో రెగ్యులర్ గా పాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్​ వోటీ ,భువనగిరి రూరల్ పోలీసులు పోలీసులు సంయుక్తంగా పాల తయారీ సెంటర్ పై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 120 లీటర్ల కల్తీ పాలు,డాల్ఫర్ ఫ్రెష్ మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్, మిక్సింగ్ రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.