కోడి పందేలపై పోలీసులు దాడి .. పందెం రాయుళ్లు పరార్

కోడి పందేలపై పోలీసులు దాడి .. పందెం రాయుళ్లు పరార్

సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందెం రాయుళ్లకు పండగే. ఆంధ్రాలోని గోదావరి జిల్లాలతో పాటు సరిహద్దుల్లో ఉండే తెలంగాణ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కోడి పందేలను కూడా పెడుతున్నారు. అయితే ఆంధ్ర నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వారు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని లక్ష్మక్కపల్లి శివారులోని ఇటుక బట్టీల సమీపంలో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళే సరికి... కొళ్లను వదిలి పందెం రాయుళ్లు అక్కడి నుంచి పరారీ అయ్యాయి. అయితే అక్కడ కోళ్ల పందెం నిర్వహించిన వారు ఆంధ్ర నుంచి వలస వచ్చిన కూలీలని పోలీసులు అనుమానిస్తున్నారు. పందెం నిర్వహించిన స్థలంలో కోళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు పందెం నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.