ప్రాణహాని ఉందని వైఎస్ సునీత ఫిర్యాదు.. FIR నమోదు చేసిన పోలీసులు

ప్రాణహాని ఉందని వైఎస్ సునీత ఫిర్యాదు..  FIR నమోదు చేసిన పోలీసులు

తనను, సోదరి షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నారని, సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వైఎస్ సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

వైఎస్ సునీత రెడ్డి ఫిర్యాదు చేయడంతో.. FIR నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ప్రాణభయంతో ఇటీవల హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

Also Read : చెట్టుపై ఎలుగుబంటి హల్ చల్.. భయాందోళన గ్రామస్థులు

509, 506 IPC తో పాటు 67 IT యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను, సోదరి షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు లేపేస్తామంటూ.. శత్రు శేషం ఉండకూడదు, ఇద్దరిని లేపేయ్ అన్నా.. ఎన్నికలకు పనికొస్తారు అని పోస్టింగ్ లు పెడుతున్నట్లు సునీత ఆధారాలు సమర్పించారు. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా పోస్టింగ్ లు పరిశీలించిన అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.