ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడే: పోలీసులు

ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడే: పోలీసులు

ప్రజాభవన్ రాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా రాష్ డ్రైవింగ్ చేసింది బోధన్  మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ పై 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ర్యాష్ డ్రైవింగ్ చేసి భారీ కేడ్స్ ఢీకొట్టింది సాహిల్ అని పోలీసులు తేల్చారు. అయితే కేసు నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో డ్రైవర్ ని లొంగి పోవాలని సాహిల్ ఆదేశించినట్లు తెలుస్తోంది. సాహిల్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో డ్రైవర్ అబ్దుల్ అసిఫ్ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. 

భారీ కేడ్స్ ను ఢీకొట్టినప్పుడు సాహిల్ తో పాటు మరో నలుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు అమ్మాయిలు, మరో ఇద్దరు అబ్బాయిలతో కలిసి సాహిల్ లాంగ్ డ్రైవ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత మరో కారులో సాహిల్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. పారిపోయిన సాహిల్ కోసం పంజాగుట్ట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

డిసెంబర్ 23న ప్రజాభవన్ ఎదుట బారీ కేడ్లను షకీల్ కుమారు సాహిల్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కారు ర్యాష్ డ్రైవింగ్ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

అయితే ఈ కేసులో సాహిల్ ను తప్పించి మరొకరు కారు నడుపుతున్నట్టు పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సీపీ విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కుమారుడు సాహిల్ అని తేల్చారు పోలీసులు. షకీల్ కొడుకు సాహిల్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.