బైక్ పై 277 చలాన్లు.. 80 వేల జరిమానా..దర్జాగా తిరుగుతూ పోలీసులకు చిక్కిండు

బైక్ పై  277 చలాన్లు.. 80 వేల జరిమానా..దర్జాగా తిరుగుతూ పోలీసులకు చిక్కిండు

వాహనాలపై  ఒకటి రెండు చలాన్లు ఉంటేనే ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారోనని భయమేస్తుంది. దొరక్కుండా వేరే రూట్లలో వెళ్లడానికి ట్రై చేస్తాం.. కానీ ఓ వ్యక్తి ఒక బైక్ పై  ఐదేళ్ల నుంచి 277 చలాన్లు పెండింగ్ లో  ఉన్నా దర్జాగా తిరుతుండు. ఈ పెండింగ్ చలాన్ల విలువు  దాదాపు 80 వేల రూపాయలు కావడం గమనార్హం.. ఈ బైక్ చలాన్లతో  దాదాపు ఇంకో కొత్త బైక్ వస్తదేమోనని కొందరు సోషల్ మీడియాలో సెటైర్ వేస్తున్నారు. 

కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల అక్టోబర్ 10న  సిక్కు వాడి ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అప్పుడే అటుగా వచ్చిన TS02 EX 1395 నంబర్ ఉన్న ఓ యూనికార్న్  బైక్ ను ఆపి తనిఖీ నిర్వహించారు.  లైసెన్స్ తో రూల్స్ ప్రకారం వెహికిల్ కు ఉండాల్సిన అన్ని సర్టిఫికెట్లను పరిశీలించారు. అయితే ఆ బైక్ పై 277  చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. 2019 జూన్‌ నుంచి 2024 డిసెంబర్‌ వరకు పేరుకుపోయిన చలాన్ల మొత్తం జరిమానా రూ.79,845 ఉన్నాయి.  

►ALSO READ | కరీంనగర్ జిల్లాలో ACB దాడులు.. అడ్డంగా దొరికిపోయిన పంచాయతీ సెక్రటరీ

హెల్మెట్ లేకుండా 254 కేసులు, మాస్క్ లేకుండా 10, ట్రిపుల్ రైడింగ్ 7 కేసులు ఉన్నాయి.  కరీంనగర్ గోదాము గడ్డకు చెందిన ఈ వాహనం నడిపిన వ్యక్తిని అబ్దుల్ ఖయ్యూమ్ (37) గా గుర్తించారు. పెండింగ్ చలాన్లు పెండింగ్ లో ఉండటంతో వాహనాన్నిట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్‌కి  తరలించారు.  పెండింగ్ చలాన్లు క్లియర్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని  కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి తెలిపారు.