అవును.. వీరు పేకాటకు బానిసలు

అవును.. వీరు పేకాటకు బానిసలు
  • నిఘాపెట్టి.. వెంటాడి పట్టుకున్న పోలీసులు
  • 18 కార్లు, 63 సెల్ ఫోన్లు, రూ.6 లక్షల నగదు స్వాధీనం
  • పేకాటరాయుళ్లు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు -సీపీ సత్యానారాయణ

పెద్దపల్లి జిల్లా: ప్రభుత్వం నిషేధించినా.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. పేకాట జూదం ఆగడం లేదు. పేకాటకు బానిసలుగా మారిన వారిని పోలీసులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. నిఘా పెట్టి వెంటాడగా.. ముగ్గురు నిర్వాహకులు భారీ సంఖ్యలో జూదరులను పోగేసి పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు రామగుండం సీపీ సత్యనారాయణ తన సిబ్బందితో పద్మవ్యూహం పన్ని దాడి నిర్వహించగా.. 54 మంది పేకాట ఆడే వారితో పాటు 3 నిర్వాహకులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి ఏకంగా రూ.6 లక్షల నగదు దొరికింది. కొందరైతే కార్లేసుకుని మరీ వచ్చి పేకాట ఆడుతున్నారు. పెద్దల ఆస్తులుండడంతో విలాసాలకు అలవాటు పడినవారుగా గుర్తించారు. పేకాట రాయుళ్లకు చెందిన 18 కార్లు, 63 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.

కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన సీపీ సత్యనారాయణ

పేకాట జూదానికి అలవాటు పడి.. బానిసలుగా మారిన వారికి రామగుండం సీపీ సత్యనారాయణ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.  కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారు. జూదం అలవాటు మనుషులను నిర్వీర్యం చేస్తుందని ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్ లను నిషేధించిందని గుర్తు చేశారు. ఇక్కడ క్లబ్ లు మూతడడంతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల కు చెందిన పేకాట రాయుళ్లు  మహారాష్ట్ర కు వెళ్లి అక్కడ క్లబ్బుల్లో ఆడి వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇప్పుడు పట్టుబడిన వారు కూడా ఆరు నెలలు నుంచి వారి కుంటుంబ సభ్యులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నవారే ఎక్కువగా ఉన్నారని సీపీ సత్యనారాయణ వివరించారు. కొంత మంది ఏకంగా పోలీసు ఠాణాల గడపదొక్కి ఫిర్యాదు చేసి కంటతడిపెట్టుకుని ఏడుస్తున్నారని ఆయన తెలిపారు. జూదరుల భరతం పట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామని.. పకడ్బందీగా దాడి చేసి  ఒకేసారి 54 మందిని పట్టుకున్నామన్నారు. పేకాట ఆడే ఎంతటివారిని అయిన వదిలిపెట్టేది ఉండదని ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

నార్సింగి అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష

రేప్ అంటే చావును కోరుకున్నట్లే .. ఏడుగురికి మరణశిక్ష

మహిళా ఎస్సై వార్నింగ్.. మంత్రి ఫోన్ చేసినా వదిలిపెట్టం