
అర్ధరాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... కరీంనగర్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. . సంజయ్ తో పాటు పలువురిపై బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో సమావేశాలు, సభలకు అనుమతి లేదన్నారు కరీంనగర్ సీపీ సత్యనారాయణ. సంజయ్ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 25 మందితో పాటు...మరికొందరిపై కరోనా నిబంధనల ప్రకారం కేసులు పెట్టామన్నారు. కావాలనే పోలీసులపై దాడికి దిగినట్లు తెలిపారు సీపీ.
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... సంజయ్ కు ఫోన్ చేశారు. అయితే పోలీస్ కష్టడీలో ఉన్నారని సంజయ్ కార్యాలయం సిబ్బంది నడ్డాకు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన నడ్డా... ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరుపున సంజయ్ చేస్తున్న పోరాటం భేష్ అన్నారు. కేసుల విషయంలో వర్రీ కావద్దని... తాము చూసుకుంటామని తెలిపారు. న్యాయ స్థానంలో పోరాడతామని తెలిపారు నడ్డా. రాష్ట్ర ప్రజలతో పాటు... బీజేపీ నాయకత్వం సంజయ్ కు అండగా ఉందన్నారు. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గరకు భారీగా బీజేపీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. అయితే కోద్ది సేపటి క్రితం పోలీస్ సెంటర్ కు సీపీ చేరుకోవటంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఎవరు ఉండకూడదన్నారు. మరోవైపు పోలీసుల తీరుపై మండిపడ్డారు నేతలు. అక్రమ అరెస్టులను కండించారు. వెంటనే బండి సంజయ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్
డీజీపీపై మండిపడ్డ ఎంపీ అర్వింద్