జమ్మూకాశ్మీర్ ఉగ్ర దాడిలో పోలీసు, పౌరుడు మృతి

జమ్మూకాశ్మీర్ ఉగ్ర దాడిలో పోలీసు, పౌరుడు మృతి

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులు, పౌరులు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. రెండు చోట్ల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తితో పాటు పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ లోని బిజ్ బెహరా ప్రాంతంలో ఏఎస్ఐ మహ్మద్ అష్రఫ్ పై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతన్ని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
మరో ఘటనలో శ్రీనగర్ లోని ఈద్గా ప్రాంతంలో ఉగ్రవాదులు అహ్మద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. క్షతగాత్రున్ని హాస్పిటల్ కు తరలించేలోపే చనపోయాడు. మృతున్ని నవకడల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు ఘటనలతో అప్రమత్తమైన అధికారులు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగుల విభజన జరగట్లే.. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వట్లే

పంజాబ్లో టీకా తీసుకున్న ఉద్యోగులకే జీతం

మధురైలో బిల్డింగ్ గోడ కూలి హెడ్ కానిస్టేబుల్ మృతి