
తెలుగు సినీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పొలిమేర2 అప్డేట్ వచ్చేసింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మా ఊరి పొలిమేరకి ఇది సీక్వెల్. 2021లో ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది.
అయితే.. అప్పట్లో ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అసలు అలాంటి ఒక సినిమా వస్తుంది అని కూడా చాలా మందికి తెలియదు. కానీ.. ఓటీటీలో రిలీజ్ అయ్యాక మాత్రం అనూహ్య స్పందన వచ్చింది ఈ సినిమాకి. కేవలం మౌత్ టాక్ తోనే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక అప్పటినుండి ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఒక చిన్న సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఇంతలా ఎదురుచూడటం ఈ సినిమాకె దక్కింది.
ఎట్టకెలకు.. ఈ మూవీకి సీక్వెల్ 'మా ఊరి పొలిమేర 2' విడుదలకు సిద్దమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో ఓ వ్యక్తి మంటల మధ్యలో అర్థనగ్నంగా కూర్చొని.. రెండు చేతుల్ని పెకి ఎత్తి దండం పెడుతున్నాడు.. మెడపై రక్తం కారుతూ ఉంది. చాలా ఇంట్రస్టెంగ్ గా, ఉత్కంఠను రేకెత్తిస్తోన్న ఈ థ్రిల్లింగ్ పోస్టర్ సినిమాపైన అంచనాలను అమాంతం పెంచేసింది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు చిత్ర బృందం తెలిపారు. ఇక సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ.. పార్ట్ 1 మాదిరిగానే ఫ్యాన్స్ ను అలరిస్తుందా.. లేదంటే దానికి భిన్నంగా రెస్పాన్స్ వస్తుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.