
కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ – జేడీఎస్ కు చెందిన 8 మంది ఎమెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఇటీవలే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. సీఎం ఫారిన్ టూర్ లో ఉండగానే బెంగళూరులో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇటీవలే JDS రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విశ్వనాథ్.. ఎమ్మెల్యేల రాజీనామా వెనక కీలకంగా ఉన్నారని తెలుస్తోంది.
తాజాగా రాజీనామాలు చేసిన 8 మంది వీళ్లే
ప్రతాప్ గౌడ పాటిల్
శివరాం హెబ్బర్
రమేశ్ జర్కిహోలి
గోపయ్య
మహేశ్ కుమటి హళ్లి
హెచ్.విశ్వనాథ్
నారాయణ గౌడ
బీసీ పాటిల్
ఇంకా మరికొందరు రాజీనామా బాటలో ఉన్నట్టు తెలుస్తోంది.