దేశంలో పెరిగిపోయిన ఫ్యామిలీ పాలిటిక్స్

దేశంలో పెరిగిపోయిన ఫ్యామిలీ పాలిటిక్స్
  • పార్లమెంట్, అసెంబ్లీల్లో బంధుత్వాల జోరు
  • ఒకరి తర్వాత ఒకరు పదవులు అనుభవిస్తున్న నేతలు
  • తండ్రీకొడుకు, తల్లీకూతురు, భార్యాభర్త, అత్తాకోడలు రాజకీయాల్లోనే..
  • ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకు ఇదే సీన్

దేశంలో రాజకీయాలు ‘ఫ్యామిలీ’ప్యాక్ ల్లా మారిపోతున్నాయి. దాదాపు అన్నిరాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో కుటుంబ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇలా అన్ని పదవుల్లోనూ ఎవరో ఒకరు బంధువులు ఉంటున్నారు. నాన్న,అమ్మ, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు వంటి కుటుంబ సభ్యులే కాకుండా మామ,అల్లుడు, వియ్యంకులు, తోడల్లుళ్లు..ఇలా పార్లమెంట్, అసెంబ్లీలు బంధుత్వాలతో విరాజిల్లుతున్నాయి.ఒకచోట ఒకే పార్టీలో, కొన్నిచోట్ల వేర్వేరు పార్టీల్లో ఉంటున్నారు.మొత్తంగా రాజకీయాలు కొన్నిఫ్యామిలీలతోనే నిండిపోతున్నాయి.ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోం ది. పార్టీ అధినేతలు, ముఖ్య నేతల వారసులు,బంధువులంతా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.- హైదరాబాద్‌‌‌‌, వెలుగు

నెహ్రూ ఫ్యామిలీ..

దేశ రాజకీయాల్లో నెహ్రూ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నెహ్రూ, ఇందిర, రాజీవ్, నుంచి ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ రాహుల్‌ గాంధీ వరకూ ఆ ఫ్యామిలీ జాతీయ రాజకీయాల్లో కొనసాగుతోంది. ఈసారి రాహుల్​ అమేథీ, వయనాడ్‌ సెగ్మెంట్ల నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. సోనియాగాంధీ రాయ్‌ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్‌ సోదరి ప్రియాంక కూడా పాలిటిక్స్ లో యాక్టివ్‌‌‌‌గా ఉన్నారు. ఇదే ఫ్యామిలీకి చెందిన మేనకాగాంధీ సుల్తాన్‌ పూర్‌నుంచి, ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ పిలిభిత్‌నుంచి పోటీ చేస్తున్నారు.

దేవెగౌడ ఫ్యామిలీ

మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం నుంచి కూడా పలువురు రాజకీయాల్లో ఉన్నారు. దేవెగౌడ ప్రస్తుతం తుమకూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.ఆయన కొడుకు కుమారస్వామి కర్నాటక సీఎం. మరో కొడుకు రేవణ్ణ ఆ రాష్ట్ర మంత్రి. కుమారస్వామి భార్య అనిత ఎమ్మెల్యే.  దేవెగౌడ మనవళ్లు నిఖిల్‌ , ప్రజ్వల్‌రేవణ్ణ ప్రస్తుతం లోక్‌‌‌‌ సభకు పోటీ చేస్తున్నారు.

ములాయం సింగ్‌ పరివార్

ఉత్తరప్రదేశ్ కు చెందిన సీనియర్​ నేత ములాయంసింగ్‌ యాదవ్‌‌‌‌ కుటుంబం నుంచి దాదాపు పది మంది పాలిటిక్స్‌‌‌‌లో ఉన్నారు. ఆయన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ లోక్‌‌‌‌సభ ఎన్ని కల్లో అజంగఢ్‌నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేష్‌ భార్య డింపుల్‌ కనౌజ్‌‌‌‌ నుంచి బరిలో నిలిచారు. ములాయం మరో కోడలు అపర్ణ, ఆయన తమ్ముడు శివపాల్‌ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ములాయం మేనల్లుడు ధర్మేంద్ర యాదవ్‌‌‌‌ బదౌన్‌ నుంచి బరిలో ఉన్నారు.ములాయంకు వరుసకు తమ్ముడైన రాంగోపాల్‌యాదవ్‌‌‌‌ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.  రాంగోపాల్​ కొడుకు అక్షయ్‌ ఫిరోజాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

ఏపీలో ఎన్టీఆర్ , చంద్రబాబు ఫ్యామిలీ..

ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ ప్రస్తుతంమంత్రిగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మంగ-ళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్టీఆర్​ కుమారుడు,చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ.. సిట్టిం గ్‌ స్థా నంహిందూపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు.బాలకృష్ణ చిన్నల్లు డు భరత్​ విశాఖ లోక్ సభకు పోటీచేస్తున్నాడు. ఇక చంద్రబాబు తోడల్లుడు దగ్గు బాటివెంకటేశ్వరరావు వైఎస్సార్​సీపీ నుంచి పర్చూరుఅసెంబ్లీ సీటుకు, ఆయన భార్య పురందేశ్వరి బీజేపీనుంచి విశాఖ లోక్ సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

వైఎస్ కుటుంబం నుంచి..

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్​మోహన్‌ రెడ్డి కూడా ఫ్యామిలీ రాజకీయాల నుంచే వచ్చారు. వైఎస్​రాజశేఖర్​రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జగన్​ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం పులివెందుల నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. జగన్​ తల్లి విజయమ్మ, ఆయన సోదరి షర్మిల కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన దగ్గరి బంధువులు అయిన అవినాశ్ రెడ్డి కడపఎంపీగా, రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

బీహార్ లో లాలూ..

బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌‌‌ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గతంలో ఆయన జైలుకెళ్లిన సమయంలో భార్య రబ్రీ దేవి సీఎంగా కొనసాగారు.ఆయన కొడుకు తేజస్వీ యాదవ్‌‌‌‌ బీహార్‌ ప్రతిపక్షనేతగా ఉన్నారు. మరో కొడుకు తేజ్‌‌‌‌ప్రతాప్‌ యాదవ్‌‌‌‌ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. లాలూ కూతురు మీసాభారతి పాటలీపుత్ర  నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు.

కేసీఆర్ టీమ్

సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ నుంచి కూడా చాలామందే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కుమారుడు, టీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎమ్మెల్యే. కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. మేనల్లుడు హరీశ్ రావు ఎమ్మెల్యేగా, కేసీఆర్‌ తోడల్లుడి కుమారుడు సంతోష్‌ రాజ్యసభ సభ్యుడిగా , బంధువు వినోద్​ ఎంపీగా ఉన్నారు.

తెలంగాణ నుంచి..

మంత్రులు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్​రెడ్డి మల్కాజ్ గిరి లోక్ సభ బరిలో , తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్​ సికింద్రాబాద్​ బరిలో ఉన్నారు. డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె మాలోతు కవిత మహబూబాబాద్​ లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ ఎంపీగా..ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం అసదుద్దీన్ ​హైదరాబాద్‌నుంచి లోక్ సభ బరిలో ఉన్నారు. వీరి తండ్రి సలావుద్దీన్‌ ఒవైసీ గతంలో ఆరుసార్లు హైదరాబాద్‌ ఎంపీగా చేశారు. ఇక మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి భువనగిరి నుంచి లోక్ సభ బరిలో ఉన్నారు. ఆయన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే. నాగర్‌ కర్నూల్‌ లోక్ సభ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి సోదరుడు భట్టివిక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన భార్య పద్మావతి రాజకీయాల్లో ఉన్నారు. వీరే కాక చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల ఫ్యామిలీలు కూడా రాజకీయాల్లో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా మరెందరో..

  • పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్‌ బాదల్‌ కొడుకు సుఖ్‌ బీర్‌ సింగ్‌ అకాలీ దళ్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. సుఖ్‌ బీ ర్‌ సింగ్‌ భార్య హర్​సిమ్రత్‌ కౌర్‌ ప్రస్తుతం కేంద్ర మంత్రి. ప్రకాశ్ సింగ్‌ బాదల్‌ సోదరుడు మన్‌ ప్రీత్‌సింగ్‌ పంజాబ్‌ మంత్రిగా పనిచేశారు.
  • నేషనల్​ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కొడుకు ఒమర్‌ అబ్దుల్లా జమ్మూ-కాశ్మీర్​ సీఎంలుగా పనిచేశారు. ఫరూక్‌‌‌‌ అబ్దుల్లా కుమార్తెను దివంగత కాంగ్రెస్‌ నేత రాజేశ్ పైలట్ కుమారుడు సచిన్​ పైలట్‌‌‌‌ పెళ్లి చేసుకున్నారు. సచిన్‌ పైలట్‌‌‌‌ ప్రస్తుతం రాజస్థాన్‌ డిప్యూ టీ చీఫ్ మినిస్టర్‌.
  • అసోం మాజీ సీఎం తరుణ్‌  గోగోయ్‌ కొడుకు గౌరవ్‌‌‌‌ కలియబోర్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరరాజె కొడుకు దుష్యంత్‌ పార్లమెంట్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
  • పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ భార్య ప్రణీత్‌ కౌర్‌ గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆయన కొడుకు రణిందర్‌ సింగ్‌ కూడా రాజకీయాల్లో ఉన్నారు.
  • శివసేన చీఫ్ ఉద్దవ్‌‌‌‌థాక్రే కొడుకు ఆదిత్యథాక్రే యువసేన అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌‌‌‌ థాక్రే.. ఉద్దవ్‌‌‌‌ థాక్రే వరుసకుసోదరులు.
  • డీఎంకే చీఫ్ స్టాలిన్‌ తమిళనాడు ప్రతిపక్షనేత.  ఆయన సోదరి కనిమొళి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, సోదరుడు అళగిరి రాజకీయాల్లో ఉన్నారు.