
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డీప్‌ఫేక్‌లు సృష్టించడానికి, సమాచారాన్ని వక్రీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను దుర్వినియోగం చేయొద్దని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను హెచ్చరించింది. సోషల్ మీడియా ద్వారా లేదా ప్రకటనల రూపంలో షేర్ చేసే ఏఐ- ఆధారిత కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్ చేయాలని సూచించింది.
పార్టీలు, స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు ఆ కంటెంట్‌ను ఏఐ -జనరేటెడ్, డిజిటల్, సింథటిక్ కంటెంట్ అని స్పష్టంగా ప్రకటించాలని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. సోషల్ మీడియా పోస్టులపై కఠిన నిఘా ఉంటుందని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని సంఘం స్పష్టం చేసింది.