పాలిటెక్నిక్​ ఎంట్రన్స్​ టెస్ట్ షెడ్యుల్ రిలీజ్

పాలిటెక్నిక్​ ఎంట్రన్స్​ టెస్ట్ షెడ్యుల్ రిలీజ్

పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్ (పాలీసెట్​–2021) నోటిఫికేషన్​ను స్టేట్​ బోర్డ్​ ఆఫ్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ అండ్​ ట్రైనింగ్​ (ఎస్​బీఈటీ)  రిలీజ్​ చేసింది. ఈ పరీక్షతో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజినీరింగ్​/నాన్​ ఇంజినీరింగ్​ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.

డిప్లొమా కోర్సులు అందిస్తున్న సంస్థలు: ప్రొఫెసర్​ జయశంకర్​ తెలంగాణ స్టేట్​ అగ్రికల్చర్​ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నికల్​ కాలేజీలు.

అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. కంపార్ట్​మెంటల్​ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 
సెలెక్షన్​ ప్రాసెస్​: కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్​ మెరిట్​ ఆధారంగా ఎంపిక

క్వాలిఫైయింగ్​ మార్క్స్
ఇంజినీరింగ్​&నాన్​ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్: మ్యాథ్స్​(60)+ఫిజిక్స్​(30)+కెమిస్ట్రీ(30)=120 మార్కులుకు పరీక్ష నిర్వహిస్తారు.
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్​: మ్యాథ్స్​(60)+ఫిజిక్స్​(30)+కెమిస్ట్రీ(30)+బయాలజీ(30)‌‌‌‌=150 మార్కులకు ఎగ్జామ్​ ఉంటుంది. 
ఇంజినీరింగ్​, నాన్​ఇంజినీరింగ్​ పాలిటెక్నిక్​ కోర్సుల్లో చేరాలనుకునే వారు బయాలజీ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలను అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.పాలీసెట్ క్వాలిఫై అవ్వాలంటే అన్ని సబ్జెక్టుల్లో కలిపి కనీసం 30 శాతం (మొత్తం 120 మార్కులకు 36 మార్కులు) సాధించాలి.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి
ఆన్​లైన్​ ప్రక్రియ ప్రారంభం: 24 మే 2021
దరఖాస్తుకు చివరితేది: 11 జూన్​ 2021
రూ.300 ఫైన్​తో: 15 జూన్​ 2021
ఎగ్జామ్​డేట్​: వెల్లడించాల్సి ఉంది
వెబ్​సైట్​:  https://polycetts.nic.in

సబ్జెక్టు    ప్రశ్నలు    మార్కులు
మ్యాథమెటిక్స్    60    60
ఫిజిక్స్    30    30
కెమిస్ట్రీ    30    30
మొత్తం    120    120