పేపర్స్ లీక్: తెలంగాణలో పాలిటెక్నిక్ పరీక్షల రద్దు

పేపర్స్ లీక్: తెలంగాణలో పాలిటెక్నిక్ పరీక్షల రద్దు

స్వాతి ఇంజనీరింగ్ కాలేజ్ లో పాలిటెక్నిక్  ఫైనల్ ఇయర్ పరీక్షా పశ్నపత్రాలు లీక్ విషయంపై బోర్డు సీరియస్ అయింది. 8,9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ పరీక్షలను మళ్లీ ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాలని డిసైడ్ చేసింది. స్వాతి కాలేజి అబ్జర్వర్ ను సస్పెండ్ చేసింది. స్వాతి కాలేజి లో చదువుతున్న విద్యార్థులను ఇతర కాలేజీలకు బదిలీ చేసింది. కాలేజికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో రిప్లై ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. అయితే పరీక్షా ప్రశ్నపత్రాలు లీక్ చేసినందుకు కాలేజీ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లోని  స్వాతి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ ఉదయం పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షా పశ్నపత్రాలు లీక్ అయ్యాయి. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిననట్టు కాలేజీపై ఫిర్యాదు చేశారు బోర్డు సెక్రెటరీ. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఇంజనీరింగ్ మ్యాథ్స్  పేపర్లను వాట్సాప్  ద్వారా విద్యార్థులకు పంపించినట్లు గుర్తించారు బోర్డు అధికారులు. ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్  ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి.