
గద్వాల టౌన్, వెలుగు: పాలిటెక్నిక్ కళాశాల వద్ద బస్సులు ఆపడం లేదని ఆ కాలేజీ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. శనివారం సాయంత్రం గద్వాల – రాయచూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద బస్సులు ఆపకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
గద్వాల టౌన్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో కాలేజీ ఉందని, రవాణా సౌకర్యం సరిగ్గా లేదని వాపోయారు. ఈ సమస్య వల్ల కొందరు సీట్లను కూడా వదులుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు రఘువంశీ, నరేశ్, సాయిహర్ష, నితిన్, గణేశ్, నజీర్, యశ్వంత్, నరేశ్, తైసిన్, రమ్య తదితరులు పాల్గొన్నారు.