ఒక జిల్లా లేదా ప్రాజెక్టుకు కాకా పేరు పెట్టాలె : సుధాకర్ రెడ్డి

ఒక జిల్లా లేదా ప్రాజెక్టుకు కాకా పేరు పెట్టాలె : సుధాకర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాకాది కీలకపాత్ర అని బీజేపీ నేత సుధాకర్ రెడ్డి అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉంటూ తెలంగాణ వాయిస్ని వినిపిస్తూ ఉండేవాడని చెప్పారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ వాయిస్ని నిరంతరం వినిపించారని అన్నారు. కాకా వర్ధంతి సందర్భంగా ఆయనకు సుధాకర్ రెడ్డి నివాళులర్పించారు. 

రాష్ట్రంలో ఒక జిల్లా లేదా ఒక ప్రాజెక్టుకు కాకా పేరు పెట్టాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోతే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక జిల్లాకు కాకా పేరు పెడతామన్నారు. కాకా మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.