
హైదరాబాద్ :తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు కోడూరి దృపత్(22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సోమవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర బైక్ డివైడర్ ను బలంగా ఢీ కొట్టి పల్టీలు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని డెడ్ బాడీని ఉస్మానియా హస్పిటల్ కి తరలించారు. స్పీడ్ డ్రైవింగే ప్రమాదానికి కారణం అయినట్టు తెలుస్తోంది. మరణవార్త వినగానే పొన్నాల వెంటనే హస్పిటల్ కి వెళ్లారు. దృపత్ చనిపోవడంతో ఆయన సోదరి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.