కేటీఆర్ టూర్..కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

కేటీఆర్ టూర్..కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

కరీంనగర్ లో రేపు కేటీఆర్ టూర్ సందర్భంగా  కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ ను  పొన్నం ప్రభాకర్ ఖండించారు. హుజురాబాద్ లో రెండు రోజుల ముందు నుంచే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. ప్రతిపక్షాల నుంచి నిరసనలు ఎదుర్కోవద్దనుకుంటే హుజురాబాద్ లో ఇచ్చిన వేల కోట్ల హామీలను నెరవేర్చాలన్నారు. ప్రతిపక్షాలను అరెస్ట్ చేసి పర్యటనలను విజయవంతం  చేయడం కరెక్ట్ పద్దతి కాదన్నారు. కరీంనగర్, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాలో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.