గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతాంగంపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, బాధ్యతలు అంటే రాజకీయ పదవులు కాదని అన్నారు.వరదలతో 10 వేల కోట్లకు పైగా నష్టం జరిగితే కేవలం కేంద్రం ఇచ్చింది 4 వందల కోట్లు మాత్రమేనని అన్నారు. డిల్లీలో దోస్తాన గల్లీలో కొట్లాట అన్నట్లుగా బీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయని అన్నారు.
Also Read :- ఫామ్ హౌస్లో ఏం జరిగిందో ఏమో.. కేసీఆర్ కనిపించట్లే
రెండు పార్టీలు కలిసి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాయని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు, పంటల సాగు వంటి విధానాలతో అన్ని విధాలుగా వ్యవసాయాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. సన్నకారు, చిన్నకారు రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాఖామంత్రి నాగేశ్వర్ రావు కృషి చేయాలని కోరుతున్నానని అన్నారు పొన్నం ప్రభాకర్.