ఎంపీ పొన్నం పోరాట ఫలితమే ఎన్ హెచ్ -563 .. 2014 మార్చిలోనే హైవేకు ఆమోదం

ఎంపీ పొన్నం పోరాట ఫలితమే ఎన్ హెచ్ -563 .. 2014 మార్చిలోనే హైవేకు ఆమోదం
  •  
  •     2016 మే 24న పొన్నంకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ లేఖ 
  •     ఆ లేఖను రిలీజ్ చేసిన మంత్రి కార్యాలయం


కరీంనగర్, వెలుగు: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ప్రజల రవాణా సౌకర్యాల కోసం చేసిన కృషి నేడు ఫలితాలు ఇస్తోంది. వరంగల్–కరీంనగర్–జగిత్యాల రోడ్డును నేషనల్ హైవేగా అభివృద్ధి చేయాలన్న నాటి డిమాండ్, ముందుచూపు ఫలితంగానే నేషనల్ హైవే 563 రూపుదిద్దుకుందని మంత్రి పొన్నం కార్యాలయం శనివారం ప్రకటించింది.

పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న సమయంలో రాసిన లేఖలకు స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2016 మే 24న అధికారికంగా పొన్నంకు రాసిన లేఖను తాజాగా విడుదల చేసింది. ఈ మార్గాన్ని మార్చి 2014లోనే నేషనల్ హైవే 563గా ప్రకటించినట్లు, సుమారు 130 కిలోమీటర్ల మేర ఫోర్ లేన్ రహదారిగా అభివృద్ధి చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు నాటి కేంద్ర కార్యదర్శి సంజయ్ మిత్ర ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభించిందని పేర్కొంది.