ప్రేమలో పడేంత టైమ్‌‌‌‌‌‌‌‌ లేదు

ప్రేమలో పడేంత టైమ్‌‌‌‌‌‌‌‌ లేదు

‘రాధేశ్యామ్‌‌‌‌‌‌‌‌’ సినిమాలోని ప్రేరణ పాత్ర పర్సనల్‌‌‌‌‌‌‌‌గా తనను మరింత స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ చేసిందని చెబుతోంది పూజాహెగ్డే. ప్రభాస్‌‌‌‌‌‌‌‌కు జంటగా ఆమె నటించిన ఈ మూవీ మార్చి 11న రిలీజ్‌‌‌‌‌‌‌‌ అవుతున్న సందర్భంగా ఆమె ఇలా ముచ్చటించింది. 

  •      సీరియస్‌‌‌‌‌‌‌‌ మెచ్యూర్డ్ లవ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ ఇది. ఇందులో చాలా షేడ్స్, డెప్త్‌‌‌‌‌‌‌‌ ఉండే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాది. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మోస్ట్‌‌‌‌‌‌‌‌ చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌ రోల్. చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మనసు పెట్టి చేశాను. కొత్త పూజాను చూస్తారు. ఈ క్యారెక్టర్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. వ్యక్తిగా నన్ను ఈ మూవీ మరింత స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ చేసింది. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ టైమ్‌‌‌‌‌‌‌‌ నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఎక్కువ రీసెర్చ్ చేశాను. ఎన్నో బుక్స్ చదివాను.
  •    రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లోనూ నేను జ్యోతిష్యాన్ని చాలా నమ్ముతాను. అది కూడా ఒక సైన్స్. చాలామంది ఆస్ట్రాలజర్స్‌‌‌‌‌‌‌‌ని కలిశాను కూడా. వాళ్లు నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి చాలా కచ్చితమైన ప్రిడిక్షన్స్ ఇచ్చారు. ఒక డాక్టర్ ఇచ్చిన మందులతో మన హెల్త్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ అవకపోతే అతన్ని మాత్రమే తప్పు పడతాం. కానీ ఓ ఆస్ట్రాలజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పు చెబితే మాత్రం ఆస్ట్రాలజీ మొత్తాన్ని తప్పుబడతాం. నిజానికి టెలిస్కోప్‌‌‌‌‌‌‌‌ తయారు చేయడానికి ఎన్నో ఏళ్ల ముందే మన సాధువులు, మునులు గొప్ప ఆస్ట్రాలజీ బుక్స్ రాశారు.
  •      ఏ సినిమాలోనైనా షిప్‌‌‌‌‌‌‌‌ మునిగిపోతోందంటే దాన్ని ‘టైటానిక్’తో పోల్చుతాం. నిజానికి అలా పోల్చడం కూడా పెద్ద కాంప్లిమెంట్. కానీ ఇది అలాంటి సినిమా కాదు. చాలా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ స్టోరీ. ఇదో యూరోపియన్‌‌‌‌‌‌‌‌ పీరియాడిక్ మూవీ. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ పెళ్లి గురించి అడిగింది నేను కాదు.. అది ఆడియెన్స్ వాయిస్‌‌‌‌‌‌‌‌ (నవ్వుతూ). ప్రభాస్‌‌‌‌‌‌‌‌ ఏం ఆన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడనేది సినిమాలోనే చూడాలి.
  •      తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్‌‌‌‌‌‌‌‌ చేయడం చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌లో చాలా లోతుకి  వెళ్లి నటించాను. ప్రేరణ పాత్రలోని బాధను ఫీలవుతూ గ్లిజరిన్ లేకుండా ఏడ్చేసిన సీన్స్ ఉన్నాయి. ఆ సీన్ కంప్లీట్ కాగానే సేమ్‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌ మరో భాషలో చేద్దాం అనేవారు. ఒకే టైమ్‌‌‌‌‌‌‌‌లో రెండు డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ మూవీస్‌‌‌‌‌‌‌‌ చేసిన ఫీల్‌‌‌‌‌‌‌‌ కలిగింది. రెండు భాషల్లో మేటర్ సేమ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది కానీ మేజిక్‌‌‌‌‌‌‌‌ డిఫరెంట్. 
  •     ప్రభాస్‌‌‌‌‌‌‌‌తో సహా ఇప్పటివరకూ నటించిన అందరు హీరోలతోనూ కెమిస్ట్రీ కుదరడం హ్యాపీ. ఒక్కో హీరో ఒకోలా ఉంటారు. ప్రభాస్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌లో చాలా జోవియల్‌‌‌‌‌‌‌‌గా ఉంటారు. తనకు కొంత సిగ్గు. చాలా మంచి ఫుడ్‌‌‌‌‌‌‌‌ పంపేవారు. ఇక ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హై ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌ పర్సన్. భాషపై కూడా పట్టు ఉంది కనుక ఏదైనా సరే సింగిల్‌‌‌‌‌‌‌‌ టేక్‌‌‌‌‌‌‌‌లో చేసేస్తాడు. వన్ మోర్ టేక్‌‌‌‌‌‌‌‌ అని నేనే అడిగేదాన్ని. అల్లు అర్జున్ కూడా వెరీ ఎనర్జిటిక్. 
  •      డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ రోల్స్ వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నందుకు హ్యాపీ. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌ వద్ద మెప్పిస్తాయి. మరికొన్ని మనం చూసినప్పుడు బాగుంటాయి కానీ రిజల్ట్ మరోలా ఉంటుంది. నేను పోషించే పాత్ర మాత్రమే నా కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది కనుక దానిపై మాత్రమే దృష్టి పెడతాను. నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ నన్ను మళ్లీ మళ్లీ తీసుకుంటున్నందుకు హ్యాపీ. అదే నాకు అతిపెద్ద కాంప్లిమెంట్. 
  •   రకరకాల భాషల్లో నటించాలని ఉంటుంది తప్ప  ప్యాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా హీరోయిన్‌‌‌‌‌‌‌‌ అని పిలిపించుకోవాలని లేదు. తెలుగు సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం. ‘మొహెంజొదారో’ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. అయినా తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రెయారిటీ ఇస్తున్నా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీనే నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చిదిద్దింది. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చెప్పడం మానేస్తే నా వర్క్ లోడ్‌‌‌‌‌‌‌‌ సగం తగ్గుతుంది. అయినా సరే డబ్బింగ్‌ను ఎంజాయ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాను. 
  •      నా లైఫ్‌‌‌‌‌‌‌‌లో లవ్‌‌‌‌‌‌‌‌లో పడేంత టైమ్‌‌‌‌‌‌‌‌ లేదు. నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంటున్నాను. ప్రేమించడానికంటూ టైమ్‌‌‌‌‌‌‌‌ ఉండాలి కదా!