ఈగోనా లేక నిర్లక్ష్యమా.. పవన్ మూవీపై పూనమ్ సంచలన కామెంట్స్

ఈగోనా లేక నిర్లక్ష్యమా.. పవన్ మూవీపై పూనమ్ సంచలన కామెంట్స్

నటి పూనమ్ కౌర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసింది. ఈమేరకు సినిమా నుండి తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ను ఆమె తప్పు పట్టింది. ఈ పోస్టర్ లో భగత్ సింగ్ పేరును హీరో కాళ్ల దగ్గర ఉంచారు. ఇదే విషయాన్ని తప్పు పట్టిన ఆమె.. మూవీ టీమ్ పై కామెంట్స్ చేసింది. "భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి పేరును టైటిల్ పోస్టర్ లో, కింద పెట్టడం అనేది ఆయనను ఇన్సల్ట్ చెయ్యడమే అవుతుంది. ఇది మీ ఈగోనా.. లేక నిర్లక్ష్యమా అంటూ పూనమ్ ఫైర్ అయ్యింది.

ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారుతున్నాయి. ఇక పూనమ్ చేసిన ఈ కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్ తమ స్టైల్లో రిప్లై ఇస్తున్నారు. అటెన్షన్ సీకర్ వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇష్యూతో తమ అభిమాన హీరో మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది అనే సంతోషం లేకుండా పోయింది పవన్ ఫ్యాన్స్ కు.

అయితే.. ఈ ఇష్యూలో పూనమ్ కు సప్పోర్ట్ గా కూడా చాలా మంది నిలబడుతున్నారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అలాంటి గొప్ప వ్యక్తి పేరును కాళ్ళ దగ్గర పెట్టడం ముమ్మా టికీ తప్పే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూపై మూవీ టీమ్ ఎలా స్పందింస్తుందో చూడాలి మరి.