
అందమైన రూపంతో ఆకట్టుకున్నా.. హీరోయిన్‌గా మాత్రం నిలబడలేక పోయింది పూనమ్ కౌర్. చాలా గ్యాప్ తర్వాత ‘నాతి చరామి’ అనే చిత్రంలో నటించింది. అరవింద్ కృష్ణ, సందేశ్ బురి ప్రధాన పాత్రలు చేశారు. నాగు గవర దర్శకత్వంలో జై వైష్ణవి నిర్మించారు. త్వరలో ఓటీటీలోకి రానున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. చూసినవాళ్లంతా ట్రైలర్‌తో పాటు పూనమ్ పర్‌ఫార్మెన్స్‌ని కూడా మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో 2000వ సంవత్సరంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. అప్పట్లో చాలామంది అమెరికా వెళ్లేవారు. వైటూకే సమస్య కారణంగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సిట్యుయేషన్‌లో ఓ కుటుంబంలో జరిగిన సంఘటన ఆధారంగా, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. భార్యాభర్తల మధ్య ఎమోషన్స్ చాలా బాగుంటాయి. ట్రైలర్‌లానే సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. మల్టీ లేయర్స్, ఎమోషన్స్ ఉన్న రోల్ పూనమ్‌ది. దీంతోనైనా ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి.