ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​

ఎక్కువ ఆర్డర్లు ఈ బ్రిటిష్‌ కంపెనీకే
ధర తక్కు వగా ఉండడం, ఈజీ డిస్ట్రిబ్యూషనే కారణం
వ్యాక్సిన్‌‌ డొస్‌ ధర రూ. 290-360 మధ్యనే

బిజినెస్‌‌ డెస్క్‌‌ వెలుగు: వివిధ కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌‌లను డెవలప్‌‌ చేస్తున్నప్పటికి, ఆస్ట్రాజెనికా–ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్శిటీలు డెవలప్‌‌ చేసిన  వ్యాక్సిన్‌‌ కోసం ఇండియాతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌‌ కోసం వచ్చిన ఆర్డర్లలో  40 శాతానికి పైగా మిడిల్‌‌ ఇన్‌‌కమ్‌‌ దేశాల నుంచే ఉన్నాయని రీసెర్చ్‌‌ కంపెనీ ఎయిర్‌‌‌‌ఫైనిటీ పేర్కొంది. కరోనా వ్యాక్సిన్‌‌ సప్లయ్‌‌ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ఆస్ట్రాజెనికాతో డీల్స్‌‌ కుదుర్చుకున్నాయని తెలిపింది. ఫైజర్‌‌, మోడర్నా వంటి కంపెనీలు డెవలప్‌‌ చేసిన వ్యాక్సిన్‌‌ చివరి దశలలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌‌లు అందుబాటులోకి వచ్చినా ఆస్ట్రాజెనికా–ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్‌‌ కోసమే ప్రపంచంలో మూడోవంతు జనాభా ఎదురుచూస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఫైజర్‌‌‌‌ డెవలప్‌‌ చేసిన వ్యాక్సిన్‌‌ డోస్‌‌ ధర సుమారుగా రూ. 1,446 వద్ద అందుబాటులోకి రానుంది.  ఈ ధరతో పోల్చుకుంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌‌ ధర చాలా తక్కువ. డోస్‌‌ ధర సుమారు రూ. 290కే తీసుకురానున్నారు . ఫైజర్‌‌‌‌ వ్యాక్సిన్‌‌ ధరలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌‌ ధర మూడో వంతు ఉంటుందని, ఇండియా నుంచి బ్రెజిల్‌‌ వరకు వివిధ దేశాలలోఈ వ్యాక్సిన్‌‌ తయారీ జరుగనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌‌తో పోలిస్తే  ఫైజర్‌‌‌‌– బయోఎన్‌‌టెక్‌‌,   మోడర్నాలు డెవలప్‌‌ చేసిన వ్యాక్సిన్‌‌లను చాలా తక్కువ టెంపరేచర్‌‌‌‌ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుందని అన్నారు. దీంతో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌‌ను తొందరగా డిస్ట్రిబ్యూట్‌‌ చేయడానికి వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఫైజర్‌‌‌‌, మోడర్నా వ్యాక్సిన్ల మొదటి సప్లయ్‌‌ను ధనిక దేశాలు బుక్‌‌ చేసుకున్నాయి. మిడిల్‌‌ ఇన్‌‌కమ్‌‌ దేశాలు ఆస్ట్రాజెనికా, నోవాక్స్‌‌ వంటి కంపెనీలు డెవలప్‌‌ చేస్తున్న వ్యాక్సిన్‌‌ల కోసం ఎదురు చూస్తున్నాయి.

ధర తక్కువే..అందుకే ఆస్ట్రా

కరోనా సంక్షోభం టైమ్‌‌లో లాభాల కోసం చూడమని ప్రకటించిన ఆస్ట్రా–ఆక్స్‌‌ఫర్డ్‌‌, తమ వ్యాక్సిన్ ధర డోస్‌‌ రూ. 290–360 రేంజ్‌‌లో ఉంటుందని చెబుతోంది. గ్లోబల్‌‌గా మాన్యుఫాక్చరింగ్‌‌, ఎక్స్‌‌పోర్ట్‌‌ రెస్ట్రిక్షన్లు తగ్గడంతో  ఈ వ్యాక్సిన్‌‌ను ట్రాన్స్‌‌పోర్ట్‌‌, స్టోర్ చేయడానికి మరింత ఈజిగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఫైజర్‌‌‌‌, మోడర్నా వంటి కంపెనీలు ఆర్‌‌‌‌ఎన్‌‌ఏ టెక్నాలజీ కింద కరోనా వ్యాక్సిన్‌‌ను డెవలప్‌‌ చేశాయి. దీంతో ఈ వ్యాక్సిన్‌‌ను చాలా తక్కువ టెంపరేచర్‌‌‌‌ వద్ద స్టోర్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది.   ఎయిర్‌‌‌‌ఫైనిటీ లెక్కల ప్రకారం ఒక్క ఆస్ట్రాజెనికా-ఆక్స్‌‌పర్డ్‌‌ నుంచి 320 కోట్ల డోస్‌‌లను 50 పైగా మిడిల్‌‌ ఇన్‌‌కమ్‌‌ దేశాలకు సప్లయ్‌‌ అవ్వనుంది.

మోడర్నా వ్యాక్సిన్‌‌ డోస్ ధర రూ. 1,850..

తమ కరోనా వ్యాక్సిన్‌‌ ధర డోస్‌‌ సుమారు రూ. 1,850–2,738 మధ్య అందుబాటులో ఉంటుందని మోడర్నా పేర్కొంది. వచ్చిన ఆర్డర్లను బట్టి ఈ ధరలలో మార్పుంటుందని పేర్కొంది. తమ వ్యాక్సిన్ కాస్ట్‌‌ ఫ్లూ వ్యాక్సిన్ కాస్ట్‌‌(సుమారు రూ. 740–3,700 మధ్యలో)లానే ఉంటుందని మోడర్నా సీఈఓ స్టీఫెన్‌‌ బన్సెల్‌‌ అన్నారు. కాగా, మోడర్నా వ్యాక్సిన్‌‌ను డోస్‌‌కు రూ. 1,850 కంటే తక్కువకే అందించాలని యురోపియన్‌‌ యూనియన్‌‌ ఈ కంపెనీతో చర్చలు జరుపుతోంది. చివరి దశలో ఉన్న మోడర్నా వ్యాక్సిన్, 94.5 శాతం ప్రభావంతంగా ఉందని కంపెనీ ప్రకటించింది. ఫైజర్‌‌‌‌–బయోఎన్‌‌టెక్ తమ వ్యాక్సిన్ రిజల్ట్స్‌‌ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ కంపెనీ వ్యాక్సిన్ రిజల్ట్స్‌‌ విడుదలయ్యాయి.

For more News….

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

రికవరీ కాలేకపోతున్నవిమాన కంపెనీలు