శరత్ బాబు శరీరం మొత్తానికి ఇన్ ఫెక్షన్ సోకింది : డాక్టర్లు

శరత్ బాబు శరీరం మొత్తానికి ఇన్ ఫెక్షన్ సోకింది : డాక్టర్లు

ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమించింది. కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణాలతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన శరత్ బాబుకు ప్రస్తుతం వెంటి లెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయనకు శరీరమంతా ఇన్ ఫెక్షన్ వ్యాపించిందన్న డాక్టర్లు.. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి చెప్పలేమని వెల్లడించారు. 

శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఈయన 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించి, మెప్పించారు. ఇప్పటివరకు ఆయన 200కి పైగా సినిమాలలో నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన శరత్ బాబు.. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు.