Soundarya Jagadish: ఇంట్లో శవంగా కనిపించిన ప్రముఖ సినీ నిర్మాత

Soundarya Jagadish: ఇంట్లో శవంగా కనిపించిన ప్రముఖ సినీ నిర్మాత

ప్రముఖ కన్నడ నిర్మాత సౌందర్య జగదీష్(Soundarya Jagadish) మృతిచెందారు. అయితే.. ఆయన మృతిపై మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముందు గుండెపోటుతో చనిపోయారని తెలియగా.. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటు కాదని, ఆత్మహత్య చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ అసలేం విషయం ఏంటంటే.. ఆదివారం ఉదయం జగదీష్ ఆయన ఫ్లాట్ లో ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ,,  అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

అయితే.. ఆయన మృతిపై ఎలాంటి విషయాలు బయటకి రాలేదు. జగదీశ్ ఫ్రెండ్ శ్రేయస్ మాత్రం.. ఆయనకీ ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు లేవని తెలిపాడు. దాంతో.. పోలీసులు జగదీశ్ మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక సౌందర్య జగదీష్ విషయానికి వస్తే.. ఆయన మస్త్ మజా మాది, స్నేహితారు వంటి సినిమాలను నిర్మించారు. అంతేకాదు.. అప్పు-పప్పు సినిమాతో ఆయన కొడుకుని కూడా హీరోగా పరిచయం చేశాడు. ఇక సౌదర్యం జగదీశ్ మరణవార్తతో కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.