యూట్యూబర్ పక్కింటి కుర్రోడు చందుగాడు అరెస్ట్

యూట్యూబర్ పక్కింటి కుర్రోడు చందుగాడు అరెస్ట్

ప్రముఖ యూట్యూబర్‌ చందు సాయి(పక్కింటి కుర్రాడు)ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నార్సింగ్‌కి చెందిన ఓ యువతిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడట. 2021 ఏప్రియల్ 25న తన పుట్టినరోజు వేడుకలకు యువతిని ఆహ్వానించి లైంగిక దాడికి పాల్పడ్డాడట. చివరకి మోసపోయానని తెలుసుకున్న సదరు యువతి.. పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు 420,376 ( 2), ఎస్సీ, ST అట్రాసిటీ కింద చందు సాయితోపాటు అతని తల్లి దండ్రులు, మరో ఇద్దరి పై కేసులు నమోదు.

ఇక చందు సాయి విషయానికి వస్తే.. ఇతను యూట్యూబ్లో‌ చాలా ఫేమస్. పక్కింటి కుర్రాడు పేరుతో అతను చేసే వీడియోలకు యూట్యూబ్‌ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల దగడ్ పేరుతో ఆయన తీసిన వెబ్ సిరీస్ యూట్యూబ్‌ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు అతని గురించి ఈ విషయం తెలియడంతో.. చందు సాయి ఫాన్స్ షాకవుతున్నారు.