పోర్నోగ్ర‌ఫీ కేస్: బెదిరించి యాక్ట‌ర్స్‌తో కాంట్రాక్ట్.. ఫొటో లీక్

V6 Velugu Posted on Aug 02, 2021

ముంబై: బాలీవుడ్‌లో అవ‌కాశాల కోసం వ‌చ్చే యువ‌తుల‌ను బ‌ల‌వంతంగా పోర్నోగ్ర‌ఫీలోకి దింపుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై శిల్పా శెట్టి భ‌ర్త‌ రాజ్ కుంద్రా అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ద‌ర్యాప్తులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వేగంగా పురోగ‌తి సాధిస్తున్నారు. మోడ‌ల్స్, కొత్త‌గా అవ‌కాశాల కోసం చూస్తున్న యాక్ట‌ర్స్‌ను బెదిరించి అడ‌ల్ట్ మూవీస్‌లో న‌టించేలా బ‌ల‌వంతంగా కాంట్రాక్ట్‌పై సంత‌కాలు పెట్టించుకుంటున్నార‌ని ఎంక్వైరీలో తేలింది. వీటిలో న‌టించ‌క‌పోతే వాళ్ల కెరీర్‌ను ఖ‌తం చేస్తామ‌ని చెప్పి బ‌ల‌వంతంగా ఈ రొంపిలోకి దించుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు.


తాజాగా పోలీసుల ఎంక్వైరీలో ఫ్లిజ్ మూవీస్ (Fliz Movies) అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం యాక్ట‌ర్స్‌తో సంత‌కాలు చేయించుకున్న కాంట్రాక్టుకు సంబంధించిన డాక్యుమెంట్ ఫొటో లీక్ అయింది. ఇందులో ఉన్న దాని ప్ర‌కారం టాప్ లెస్, బ్యాక్ ఫుల్ న్యూడ్ సీన్స్ చేయాల్సి ఉంటుంద‌ని రాసి ఉంది. కానీ యాక్ట‌ర్ల‌కు ముందుగా ఆ ప్రొడ్యూస‌ర్లు చెప్పింది మాత్రం మ‌రోలా ఉంది. వాళ్లు న‌టించే న్యూడ్, అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న భాగాన్ని బ్ల‌ర్ చేస్తామ‌ని చెప్పార‌ని, కానీ ఆ త‌ర్వాత అలా చేయ‌లేద‌ని పోలీస్ ఎంక్వైరీలో బాధిత యువ‌తులు, యాక్ట‌ర్లు తెలిపార‌ని ముంబై పోలీసులు వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే పోలీసుల‌కు దొర‌క్కుండా ఉండేందుకు.. త‌మ త‌ప్పు ఏం లేద‌ని చెప్పుకునేలా కాంట్రాక్ట్‌ల‌లో ఎలాంటి బ‌ల‌వంతం లేకుండా ఆ సీన్ల‌లో న‌టించేందుకు వాళ్లు పూర్తి అంగీకారం తెలిపార‌న్నట్టు రాసి బెదిరించి సంత‌కాలు పెట్టించుకున్నార‌ని తెలిపాయి.

Tagged Contract, Raj Kundra, Porn videos case

Latest Videos

Subscribe Now

More News