థాంక్స్ పోలీస్.. 370 రద్దుపై కశ్మీర్‌లో పాజిటివ్ రియాక్షన్

థాంక్స్ పోలీస్.. 370 రద్దుపై కశ్మీర్‌లో పాజిటివ్ రియాక్షన్

ఈ ఫొటో చూశారా. సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. ఓ పిల్లాడు రోడ్డుపై గస్తీ కాస్తున్న ఓ సీఆర్పీఎఫ్ మహిళా పోలీస్ కు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు తీసిన ఫొటో అది. థాంక్స్ పోలీస్ అంటున్నట్టుగా ఉంది కదా.

కశ్మీర్ లో పరిస్థితిని మార్చే ఉద్దేశంతో, అన్ని వర్గాలకు హక్కులు అందించే సంకల్పంతో… ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించి.. జమ్ముకశ్మీర్ ను ఇండియాలో పూర్తిగా విలీనం చేసింది. ఈ సమయంలో.. ఎటువంటి గొడవలు జరకుండా జమ్ముకశ్మీర్ అంతటా భారీ స్థాయిలో సాయుధ బలగాలను మోహరించింది. కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించింది. తాజాగా జమ్ములో ఇప్పటికే 144 సెక్షన్ ఎత్తేసింది ప్రభుత్వం. జమ్మూలో స్కూళ్లు తెరచుకున్నాయి. షాపులు, మాల్స్, దుకాణాలు కూడా ఓపెన్ చేశారు. సరుకుల కోసం జనం బయటకు వస్తున్నారు. పోలీసులు అడుగడుగునా భద్రత కల్పిస్తున్నారు.

విధుల్లో ఉన్న పోలీసులకు జమ్ములోని స్థానికులు సహకరిస్తున్నారు. స్కూళ్లకు తీసుకెళ్తున్నప్పుడు.. మార్కెట్ కు వెళ్తున్నప్పుడు.. పోలీసులను చూసి చిరునవ్వుతో పలకరిస్తున్నారు. ఆయుధాలు పట్టిన పోలీసులకు చిన్నపిల్లలు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పట్టణ యువత ఆర్టికల్ 370  రద్దుపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జమ్ముకశ్మీర్ కు మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు కొందరు యువతీయువకులు.

కశ్మీర్ లోయలో 144 సెక్షన్ ఇంకా కొనసాగుతోంది. బక్రీద్ సమయానికి ఆంక్షలు ఎత్తేస్తామని గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. జమ్ముకశ్మీర్ లో బక్రీద్ కోసం వేలసంఖ్యలో గొర్రెలు, మేకలు, కోళ్లు సిద్ధంగా ఉన్నాయని..నిత్యావసరాలకు ఇబ్బంది లేదని చెప్పారు.