‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీకి పాజిటివ్ టాక్

‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీకి పాజిటివ్ టాక్

నందు, రష్మి జంటగా రాజ్ విరాట్ దర్శకత్వంలో ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి కలిసి నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌‌‌‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌‌‌‌లో రష్మి మాట్లాడుతూ ‘మంచి కథను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మా చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది. ఇందులోని నాన్న సెంటిమెంట్‌‌‌‌కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు.

నందు చేసిన పోతురాజు క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు నేను నటించిన వాణి పాత్రకు మంచి అప్లాజ్ రావడం హ్యాపీ. నాకిది బ్లాక్ బస్టర్ మూమెంట్’ అని చెప్పింది. నందు మాట్లాడుతూ ‘విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. పోకిరి సీన్‌‌‌‌కు థియేటర్స్‌‌‌‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది’ అన్నాడు. మొదటి సినిమాకే దర్శకుడిగా పేరు రావడం ఆనందంగా ఉందన్నాడు రాజ్ విరాట్. అందరి సపోర్ట్‌‌‌‌తోనే సక్సెస్ అందుకున్నాం అన్నారు నిర్మాతలు.