ఇంటర్ తో ఇంటిగ్రేటెడ్​ ‘లా’

ఇంటర్ తో ఇంటిగ్రేటెడ్​ ‘లా’


సొసైటీలో గౌరవంతోపాటు గుర్తింపునిచ్చే ‘లా కెరీర్​’ కు డిమాండ్​ పెరుగుతోంది. దేశంలో ఎన్నో ఇన్​స్టిట్యూట్లు ఇంటర్​ కంప్లీట్​ చేసిన వారికి ఇంటిగ్రేటెడ్​ ‘లా’ కోర్సులు ఆఫర్​ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లాసెట్​, నేషనల్​ లెవెల్​లో క్లాట్​ ఎంట్రెన్స్​ల ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. ఆయా ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు ఇంకా గడువు ఉన్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్​ లా కోర్సు కెరీర్ ​ గైడెన్స్ ఈ వారం.

లా కెరీర్​ కోరుకునేవారు ఇంటర్మీడియట్​ నుంచే ఆ దిశగా అడుగులు వేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో లాసెట్​ రాసి అయిదేళ్ల ఎల్​ఎల్​బీ కోర్సులో చేరవచ్చు. జాతీయ స్థాయిలో క్లాట్​కు హాజరై మంచి స్కోర్​ చేస్తే డిగ్రీ, ఎల్​ఎల్​బీ కలిపి చదువుకోవచ్చు. ఇదీ అయిదేళ్లకే పూర్తవుతుంది. సాధారణంగా ఇంటర్​ తర్వాత డిగ్రీ మూడేళ్లు, మళ్లీ ఎల్​ఎల్​బీ మూడేళ్లు మొత్తం ఆరేళ్ల సమయం పడుతుంది. ఇంటిగ్రేటెడ్​ కోర్సుల్లో చేరితే ఒక ఏడాది ఆదా అవడంతోపాటు సబ్జెక్టుపై పట్టు సంపాదించడానికి అవకాశం దక్కుతుంది.

నచ్చిన స్ట్రీమ్​లో..

స్టూడెంట్స్​ ఇంటర్​లో పూర్తి చేసిన సబ్జెక్టులు/వారికి నచ్చిన స్ట్రీమ్​లో లా పూర్తి చేయొచ్చు. దేశంలో వివిధ స్ట్రీమ్స్​లో ఇంటిగ్రల్​ లా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్​ స్ట్రీమ్​లో  బీఏ + ఎల్​ఎల్​బీ, బీఏ + ఎల్​ఎల్​బీ(హానర్స్​), కామర్స్​ & బిజినెస్​ స్ట్రీమ్​లో బీబీఏ+ ఎల్​ఎల్​బీ, బీకామ్​ + ఎల్​ఎల్​బీ, సైన్స్​ & టెక్నాలజీ స్ట్రీమ్​లో ​బీఎస్సీ + ఎల్​ఎల్​బీ, బీటెక్​ + ఎల్​ఎల్​బీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అడ్మిషన్స్​ ఇలా..

ఇంటిగ్రేటెడ్​ లా చదవాలంటే ఇంటర్​ తర్వాత లాసెట్​/క్లాట్​/ఏఐఎల్​ఈటీ తదితర  ఎంట్రెన్స్​ ఎగ్జామ్స్​ రాయాల్సి ఉంటుంది. వీటిలో వచ్చిన ర్యాంక్​ ఆధారంగా కౌన్సెలింగ్​ నిర్వహించి అడ్మిషన్​ కల్పిస్తారు. వీటితోపాటు కొన్ని ప్రైవేటు వర్సిటీలకు ఎల్​శాట్​ ఇండియా, సింబయాసిస్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ వంటి ప్రత్యేక పరీక్షలు ఉన్నాయి. తెలంగాణలో లాసెట్​ ద్వారా ప్రభుత్వ కన్వీనర్​ సీట్లు, మేనేజ్​మెంట్​ కోటా సీట్లు అందుబాటులో ఉండగా, క్లాట్​ ద్వారా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇంటిగ్రేటెడ్​ లా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

లాసెట్​ 2021​

ఇంటర్​ తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్​ లా కోర్సులో ప్రవేశాలకు ఇప్పటికే లాసెట్​ 2021 నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ ఎంట్రెన్స్​ అప్లికేషన్​ గడువును  కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో మే 26 వరకు పొడిగించారు. 

కోర్సు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్​ ఎల్​ఎల్​బీ

సీట్లు: మొత్తం 2,325 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1861 కన్వీనర్​ కోటా కాగా.. మేనేజ్​మెంట్​ కోటాలో 464 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: 10+ 2 విధానంలో ఇంటర్మీడియట్​ పూర్తి చేసి ఉండాలి. జనరల్​, బీసీ అభ్యర్థులు ఇంటర్​లో 45 శాతం మార్కులు స్కోర్​ చేసి ఉండాలి. ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఎగ్జామ్​ ప్యాటర్న్: మల్టిపుల్​ చాయిస్​ విధానంలో 120 మార్కులకు ఎంట్రెన్స్​ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. టెస్ట్​ డ్యురేషన్​ 90 నిమిషాలు. లాసెట్​లో జనరల్​ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు అంటే 120లో 42 మార్కులు స్కోర్​ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినిమం క్వాలిఫైయింగ్​ మార్క్స్​ లేవు.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో..

అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ ఎస్టీ, పీహెచ్​ స్టూడెంట్స్​ రూ. 500 చెల్లించాలి.
అప్లికేషన్లకు చివరి తేది: మే 26
వెబ్​సైట్: www.lawcet.tsche.ac.in