రైతులకు అందిన పోస్టాఫీస్ డబ్బులు

రైతులకు అందిన పోస్టాఫీస్ డబ్బులు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: పోప్టాఫీస్ అధికారి తప్పిదం కారణంగా మోసపోయిన రైతులకు శుక్రవారం ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కలెక్టర్​ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్​డబ్బులు అందజేశారు. రూ.1.15 కోట్లను 75 మంది రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఆదిలాబాద్ పట్టణంలోని పోస్టాఫీస్​లో రైతుల ఖాతాలో సీసీఐ నుంచి డబ్బులు జమ చేయగా ఓ అధికారి తప్పిదం కారణంగా 75 మంది రైతుల ఖాతాల్లోని ఆ డబ్బులు మాయమైనట్లు తెలిపారు.

దీంతో కలెక్టర్ ప్రత్యేక చొరవతో మూడు నెలల్లోనే సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. జిల్లాలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నా యని, రైతులు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్​ను, ఎమ్మెల్యేను సన్మానించారు.