
సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మరచిన మోసకారి అంటూ కేటీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల్లో ఎల్లారెడ్డి మండల విద్యార్థుల పేరుతో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కేటీఆర్ బలపర్చిన సెస్ అభ్యర్థిని ఓడించి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఈ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల ప్రజలారా..సెస్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని, మనల్ని మోసం చేసిన వారికి బుద్ది చెబుదాం అని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. మీరు కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలంటూ ఎల్లారెడ్డి మండల విద్యార్థులు పిలుపునిచ్చారు.