మెరిట్‌‌‌‌ ప్రకారం పోస్టింగ్‌‌‌‌ ఇవ్వాలి : టీజీఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌కు హైకోర్టు ఆదేశం

మెరిట్‌‌‌‌ ప్రకారం పోస్టింగ్‌‌‌‌ ఇవ్వాలి :  టీజీఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ కమ్‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌ పోస్టుల ఎంపికలో మెరిట్‌‌‌‌ ప్రకారం పిటిషనర్‌‌‌‌కు పోస్టింగ్​ ఇవ్వాలని టీజీఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో సంబంధం లేకుండా పోస్టింగ్​తో పాటు అన్ని బెనిఫిట్స్‌‌‌‌ ఇవ్వాలని సూచించింది. జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ కమ్‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌ పోస్టుకు ఎంపికైనప్పటికీ.. రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో నాన్‌‌‌‌ లోకల్‌‌‌‌ జిల్లా అని చెప్పి తనకు టీజీఎస్‌‌‌‌పీ డీసీఎల్‌‌‌‌ పోస్టింగ్‌‌‌‌ ఇవ్వలేదంటూ కామారెడ్డి జిల్లాకు చెందిన టి.గోపాల్‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌‌‌‌ టి.మాధవి దేవి ఇటీవల విచారణ చేసి తీర్పు చెప్పారు. జూనియర్‌‌‌‌ లైన్‌‌‌‌మెన్‌‌‌‌ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించ వని ఇదే హైకోర్టు తీర్పు చెప్పిందని పిటిషనర్‌‌‌‌ తరఫున అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్‌‌‌‌ చేసిన వాదనను కోర్టు ఆమోదించింది.