- ఆసియా గేమ్స్ ఏడాది ఆలస్యంగా..
- వచ్చే ఏడాది సెప్టెంబర్ 23- అక్టోబర్ 8కి రీషెడ్యూల్
కువైట్/బీజింగ్: కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆసియా గేమ్స్ ఏడాది ఆలస్యంగా జరగనున్నాయి. చైనాలోని హాంగ్జౌ వేదికగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 23–అక్టోబర్ 8 మధ్య ఈ గేమ్స్‌ను రీషెడ్యూల్ చేసినట్టు ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ (ఓసీఏ) మంగళవారం ప్రకటించింది. 19వ ఎడిషన్ ఆసియా గేమ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 10–25 మధ్య హాంగ్జూలలో జరగాలి. కానీ, చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడంతో గేమ్స్‌ను వాయిదా వేస్తూ ఈ ఏడాది మే 6న నిర్ణయం తీసుకున్నారు. చైనా ఒలింపిక్ కమిట్, హాంగ్జౌ ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ, ఇతర వాటాదారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ గేమ్స్‌ను వచ్చే ఏడాదికి రీషెడ్యూల్ చేసిన్టటు ఓసీఏ పేర్కొన్నది. ఇతర మేజర్ ఇంటర్నేషనల్ ఈవెంట్లకు ఇబ్బంది రాకుండా చూసుకున్నట్టు చెప్పింది. కానీ, వచ్చే ఏడాది ఇదే టైమ్‌లో (సెప్టెంబర్ 16–24) రష్యాలో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది.