వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై విచారణ 25కు వాయిదా

వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై విచారణ 25కు వాయిదా

ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిగింది.రించింది. EVMలతో పాటు 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ దేశంలోని 21 పార్టీలు కలిసి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం… కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ  నెల 25కు వాయిదా వేసింది. పిటిషన్‌ విచారణ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ఒక అధికారి కోర్టుకు హాజరుకావాలని సుప్రీం ఆదేశించింది.

EVMలలో నమోదైన ఓట్లకు వీవీప్యాట్‌ మిషన్ల స్లిప్పుల మధ్య తేడా వస్తుండటంతో పలు రాజకీయ పార్టీలు ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లకు, వీవీప్యాట్‌ మిషన్లు జారీచేసిన రసీదులను సరిపోల్చి చూడాల్సిందేనని ఆయా పార్టీలు కోర్టును అభ్యర్ధించాయి.